: వ్యవసాయ సంక్షోభం వల్లే రైతులు వలస బాట పట్టారు: ప్రొ.కోదండరాం
తెలంగాణ ప్రభుత్వంపై టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం మరోసారి విమర్శలు చేశారు. తెలంగాణలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. నకిలీ విత్తనాలతో నానా కష్టాలు పడుతున్నారని చెప్పారు. బాధ్యులైన విత్తన కంపెనీలపై చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ సంక్షోభం వల్లే రైతులు వలస బాట పట్టారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు పెట్టుబడి రాయితీ, రుణమాఫీ ప్రయోజనం లభించడం లేదని అన్నారు. ప్రభుత్వం ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి ఆదుకోవాలని కోరారు.