: మీ దాడులు ఆపండ్రా బాబూ: తాలిబాన్లను వేడుకుంటోన్న పాక్
ఉగ్రవాద మూకలకు ఇన్నాళ్ళూ ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్ కు.. టెర్రర్ ఫలితాలు స్వీయానుభవంలోకి వస్తే గానీ తత్వం బోధపడినట్టులేదు. గత కొన్నేళ్ళుగా మిలిటెంట్ ఆత్మాహుతి దాడులతో అట్టుడుకుతున్న పాకిస్తాన్ లో మే 11న పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ రాజకీయ నాయకుల పాలిట పెనుముప్పుగా పరిణమించిన తెహ్రీక్-ఏ-తాలిబాన్ ను నిలువరించేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించిన పాక్ సర్కారు అవన్నీ తేలిపోయేసరికి.. కాళ్ళబేరానికి దిగింది. దాడులు ఆపాలంటూ విన్నపాలతో వేడుకుంటోంది.
ఎన్నికల ప్రచారం మొదలైన ఏప్రిల్ 21 నుంచి ఇప్పటి వరకు తాలిబాన్లతో పాటు ఇతర మిలిటెంట్ గ్రూపులు 20 సార్లు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో 46 మంది మరణించగా, 190 మంది గాయపడ్డారు.