: శ్రీకాకుళం సోంపేటలో మొరాయించిన రైల్వే గేటు... ఎక్స్‌ప్రెస్ వేగంగా వస్తోన్న సమయంలో ఘటన.. అప్రమత్తమైన సిబ్బంది
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలస వద్ద ఈ రోజు ప్రమాదం తప్పింది. ఆ ప్రాంతంలో రైల్వే గేటు ఒక్కసారిగా మొరాయించింది. ట్రైన్ వస్తోన్న సమయంలో రైల్వే గేట్ వేయడానికి ప్రయత్నించిన సిబ్బంది ఈ విషయాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది పట్టాల పైనుంచి వాహన రాకపోకలను సకాలంలో ఆపేశారు. దురంతో ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగంగా వస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే గేటులో ఏర్పడిన సమస్యను పరిష్కరించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.