: అమెరికాకు వెళ్లిన రజనీకాంత్... అభిమానుల్లో ఆందోళన!


కబాలీ షూటింగ్ జరుగుతున్న వేళ, ఆరోగ్యం మందగించడంతో అమెరికాకు వెళ్లి, దాదాపు 40 రోజుల పాటు అక్కడే ఉండి ఆరోగ్యం కుదుట పడిన తరువాత ఇండియాకు వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్, మరోసారి అమెరికాకు వెళ్లారు. రోబో సీక్వెల్ పాటల షూటింగ్ లో పాల్గొనేందుకు ఉక్రెయిన్ వెళ్లాల్సిన ఆయన, ఆరోగ్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారని తెలియడంతో రజనీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రజనీ సడన్ గా యూఎస్ కు వెళ్లడంపై తమిళ ప్రసార మాధ్యమాల్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టాకీ పార్టును పూర్తి చేసుకున్న రోబో రెండో భాగంలో సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News