: మద్దెలచెరువు సూరి ప్రధాన అనుచరుడిపై బెంగళూరులో దాడి


మద్దెల చెరువు సూరి హత్య సమయంలో కారు డ్రైవర్ గా పని చేసిన మధుసూదనరెడ్డిని మాఫియా డాన్ బెట్టు మంజు బట్టలూడదీసి కొట్టిన ఘటన కలకలం రేపుతోంది. బెంగళూరులో రెడ్డప్పరెడ్డితో కలిసి మధుసూదనరెడ్డి పేకాటక్లబ్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో భూదందాలకు కూడా పాల్పడుతున్నాడు. ఓ తగాదాలో తలదూర్చిన మధుసూదనరెడ్డిని కిడ్నాప్ చేసిన బెట్టు మంజు అనుచరులు బెంగళూరు శివారుల్లో ఓ బహిరంగ ప్రదేశంలో, బట్టలూడదీసి చితక్కొట్టారు. బూటుకాళ్లతో తన్నారు. క్షమించమని వేడుకుంటున్నా రక్తాలు కారేలా కొట్టి, ఇంకోసారి కలుగజేసుకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కాగా, యూసుఫ్ గుడాలో మద్దెలచెర్వు సూరి హత్య సమయంలో కారు డ్రైవర్ గా ఉన్న మధుసూదనరెడ్డి అప్రూవర్ గా మారి భానుప్రకాశ్ ను పట్టించిన సంగతి తెలిసిందే. అనంతరం బెంగళూరు మకాం మార్చాడు.

  • Loading...

More Telugu News