: నేను పెద్ద అందగత్తెను కాదు: ఇలియానా
తాను పెద్ద అందగత్తెను కాదని ప్రముఖ నటి ఇలియానా తెలిపింది. నాజూకు నడుముకు కేరాఫ్ అడ్రస్ గా పేర్కొనే ఇలియానాకు ఎంతో మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ తాజాగా అందంపై తనదైన శైలిలో స్పందించింది. తాను అందంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదని, ఎందుకంటే తనది అంత ప్రకాశవంతమైన చర్మమేమీ కాదని స్పష్టం చేసింది. భారతీయ సినీ పరిశ్రమలో మేనిఛాయ బాగున్నవారు, చామనఛాయలో ఉండి మంచి ప్రతిభ కలిగిన వారు కూడా రాణిస్తున్నారని ఇలియానా అభిప్రాయపడింది. అందుకే తాను భారతీయ సినిమాలకు చర్మం రంగుతో పనిలేదని అనుకుంటానని తెలిపింది. అందుకే తాను చర్మపు రంగు గురించి పెద్దగా పట్టించుకోననని చెప్పింది. అందానికి సిసలైన నిర్వచనం ఏంటంటే సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడమేనని ఇలియానా నిర్వచించింది.