: భువనేశ్వర్ ఎస్‌యూఎం ఆసుపత్రి భారీ అగ్నిప్రమాదం కేసులో లొంగిపోయిన ఆసుపత్రి నిర్వాహకుడు
ఒడిశాలోని భువనేశ్వర్ ఎస్‌యూఎం ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 21 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఓ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి నడుస్తోంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి నిర్వాహకులు నవీన్ రంజన్ నాయక్‌తో పాటు ఆయన భార్య దేశం నుంచి పారిపోకుండా నోటీసులు జారీ చేయాలని నిన్న సాయంత్రం పోలీసులు కేంద్ర హోం శాఖను కోరారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నవీన్ రంజన్ నాయక్ ఆ రాష్ట్రంలోని కందగిరీ పోలీస్‌స్టేషన్‌లో స్వచ్ఛందంగా లొంగిపోయాడు. ఈ కేసులో మరి కొందరిని కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.