: ముగిసిన ట్రంప్, హిల్లరీ చివరి డిబేట్...అమెరికా అధ్యక్షుడెవరో నిర్ణయమైపోయినట్టే!


అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ డోనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్ ప్రచారం ఇంచుమించు ముగిసినట్టే. వచ్చెనెలలో జరగనున్న చివరి దఫా ఎన్నికలతో అమెరికా అధ్యక్ష అభ్యర్థి ఎవరు? అనేది నిర్ణయం కానున్నప్పటికీ నేడు ముగిసిన ఫైనల్ డిబేట్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించింది. ఇప్పటికే రెండు డిబేట్లలో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన హిల్లరీ క్లింటన్ పై ఆ దేశీయుల్లో నమ్మకం ఏర్పడింది. ఇలాంటి సమయంలో ఫైనల్ డిబేట్ లో క్లింటన్ పై పైచేయి సాధించేందుకు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. పాత చింతకాయపచ్చడిలా ఫైనల్ డిబేట్ కొనసాగింది. గతంలో చేసుకున్న ఆరోపణలనే మరోసారి ఇద్దరూ వల్లెవేయడంతో వైట్ హౌస్ లో అడుగుపెట్టేది ఎవరు? అన్నది ఇంచుమించు తేలిపోయినట్టేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News