: ధోనీని ఊరిస్తున్న మూడు రికార్డులు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పటి వరకూ 279 వన్డేలు ఆడి, మొత్తం 8939 పరుగులు చేశాడు. వన్డేల్లో 9,000 పరుగుల క్లబ్ లో చేరేందుకు ధోనీ ఇంకా 61 పరుగుల దూరంలో ఉన్నాడు. అలాగే ఈ వన్డేలో తను మరో మూడు సిక్సర్లు బాదితే సచిన్ పేరిట వున్న 195 సిక్సర్ల రికార్డును సమం చేస్తాడు. అలా కాకుండా ఏడు సిక్సర్లు బాదితే 200 సిక్సర్లు బాదిన తొలి టీమిండియా ఆటగాడిగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదిస్తాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఈ రికార్డుల మోత మోగించాలని ధోనీ భావిస్తున్నాడు.