: హెరిటేజ్ ఫుడ్స్ కు గోల్డెన్ పీకాక్ అవార్డు.. లండన్ లో స్వీకరించిన భువనేశ్వరి!
తమ కుటుంబ ఆస్తులను నారా లోకేష్ ప్రకటించిన రోజే, ఆ కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. లండన్ లో ఈ అవార్డును ఈ సంస్థ వైస్ ఛైర్మన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వినియోగదారులకు మెరుగైన సేవలందించడంలో హెరిటేజ్ సంస్థ ముందుంటుందని అన్నారు. గోల్డెన్ పీకాక్ ఆవార్డు గెలుచుకునేందుకు కారణమైన సిబ్బంది, వినియోగదారులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, తాజా సరకులు అందించడాన్ని హెరిటేజ్ ప్రథమ కర్తవ్యంగా భావిస్తుందని ఆమె చెప్పారు. నాణ్యత పాటించడంలో హెరిటేజ్ ఎప్పుడూ రాజీపడదని ఆమె అన్నారు.