: యాదాద్రి ఇకపై యాదాద్రి-భువనగిరి జిల్లా: సీఎం కేసీఆర్
యాదాద్రి జిల్లా ఇకపై యాదాద్రి-భువనగిరి జిల్లాగా మారనుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష అనంతరం భువనగిరిలోని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత ఎలిమినేటి కృష్ణారెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. యాదాద్రిని భువనగిరి జిల్లాగా మార్చాలని కృష్ణారెడ్డి ఈ సందర్భంగా కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తికి స్పందించిన కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి జిల్లాను ఇకపై యాదాద్రి-భువనగిరి జిల్లాగా పిలవాలని, యాదాద్రి-భువనగిరి జంటగా అభివృద్ధి చెందుతాయని కేసీఆర్ పేర్కొన్నారు.