: విశాఖ కలెక్టరు కార్యాలయంలో కిడ్నాప్ కలకలం
విశాఖపట్టణంలోని కలెక్టరు కార్యాలయంలో కిడ్నాప్ కలకలం రేగింది. మహారాణిపేటలో గల కలెక్టరు కార్యాలయానికి ఓ వృద్ధుడు వచ్చాడు. కలెక్టరు కార్యాలయం లోపలికి ఆయన వెళుతుండగా, ఓ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు అతనిని బలవంతంగా కారు ఎక్కించుకుని తీసుకుపోయినట్టు సీసీటీవీ పుటేజ్ లో కనిపించింది. ఏదో భూ వివాదం కారణంగా అతనిని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా కారును వెదుకుతున్నారు.