: జైపూర్ మేయర్ పైకి చెప్పు విసిరిన కాంగ్రెస్ నాయకుడు
రాజస్థాన్ రాజధాని జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాలు రెండో రోజూ రసాభాస అయ్యాయి. మేయర్ పైకి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ చెప్పువిసిరారు. అయితే, అది మేయర్ కు తగలకుండా పోడియం దగ్గర పడింది. ఈ సంఘటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సమావేశాన్ని కొద్ది సేపు వాయిదా వేశారు. అనంతరం తిరిగి సమావేశం నిర్వహించారు. అంతకుముందు, జైపూర్ ప్రస్తుత బీజేపీ మేయర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన గత మేయర్ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను బీజేపీ కౌన్సిలర్ మన్ పండిత్ పోల్చి చూపిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.