: సీఎం వ్యాఖ్యలపై హరీశ్ రావు కౌంటర్


బయ్యారం ఉక్కును విశాఖకు తరలించడం ఖాయమని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. సీఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం మొండిపట్టుదల వీడకుంటే కచ్చితంగా భూకంపం సృష్టిస్తామని హరీశ్ రావు బదులిచ్చారు. ముఖ్యమంత్రి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తుంటే అక్కడే ఉన్న మంత్రులు చప్పట్లు కొట్టడం సరికాదన్నారు.

  • Loading...

More Telugu News