: తమిళనాడులో మూడు స్థానాల ఉప ఎన్నికలకు అన్నాడీఎంకే అభ్యర్థులు ఖరారు
తమిళనాడులో మూడు స్థానాల్లో ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జయలలిత ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ఉప ఎన్నికలకు అన్నాడీఎంకే తరఫున అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు ఈ రోజు అన్నాడీఎంకే ఆ మూడు అసెంబ్లీ స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. తంజావూర్, అరవకురిచి, తిరుప్పరన్‌కుంద్రం అసెంబ్లీ స్థానాల్లో ఎవరెవరిని బరిలోకి దింపాలో నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 19న ఈ ఉప ఎన్నికలు జరుగనున్నాయి.