: మరో కొత్త ఆఫర్ ప్రకటించిన ఎయిర్ టెల్


ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ఈ రోజు మరో కొత్త ఆఫర్ ను ప్రకటించింది. రిలయన్స్ జియో దూకుడును అడ్డుకునేందుకు ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది. కొత్తగా కొనుగోలు చేసిన ఏ 4జీ స్మార్ట్ ఫోన్ కైనా రూ. 259కి 10 జీబీ 4జీ డేటా ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ దేశమంతటా ఉంటుందని భారతీ ఎయిల్ టెల్ ప్రకటించింది. ఒక జీబీ డేటా తక్షణమే యూజర్ ఖాతాలో పడుతుందని... మిగిలిన 9 జీబీ డేటా మాత్రం 'మై ఎయిర్ టెల్ యాప్' ద్వారా పొందవచ్చని తెలిపింది. 4జీ అందుబాటులో లేని ప్రాంతాల్లో 3జీ డేటా వాడుకోవచ్చని వెల్లడించింది. 90 రోజుల వ్యవధిలో గరిష్టంగా మూడు సార్లు రీచార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆగస్టులో ఇదే ఆఫర్ ను చత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఎయిర్ టెల్ ప్రవేశపెట్టింది. అయితే కేవలం శాంసంగ్ గెలాక్సీ జే సిరీస్ స్మార్ట్ ఫోన్లకే ఈ సదుపాయం కల్పించింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో, అన్ని బ్రాండ్ల 4జీ స్మార్ట్ ఫోన్లకు ఈ సౌకర్యాన్ని విస్తరించింది.

  • Loading...

More Telugu News