: ఆ చిన్నారి నిండునూరేళ్లు వర్ధిల్లాలి: సీఎం చంద్రబాబు


అనారోగ్యం బారి నుంచి బయటపడ్డ చిన్నారి జ్ఞాన సాయి సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు వర్థిల్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. కాగా, కాలేయ వ్యాధితో బాధపడిన చిన్నారికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయంతో నిన్న చెన్నై అపోలో ఆసుపత్రిలో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ శస్త్రచికిత్స నిమిత్తం రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. ఏపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా తమ కృతఙ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News