: డొనాల్డ్ ట్రంప్ డైనోసార్ లాంటి వాడు!: హాలీవుడ్ నటి హెలెన్ మిరెన్
యూఎస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ పై ఆస్కార్ అవార్డు విజేత, హాలీవుడ్ నటి హెలెన్ మిరెన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. డొనాల్డ్ ట్రంప్ డైనోసార్ లాంటి వాడని విమర్శించింది. వాస్తవానికి డైనోసార్లు ఎప్పుడో అంతరించిపోయాయని... కానీ, కొన్ని పాత డైనోసార్లు మాత్రం మిగిలే ఉన్నాయని... వాటిలో ట్రంప్ ఒకడు అని ఎద్దేవా చేసింది. తన తాజా చిత్రం 'ఐ ఇన్ ద స్కై' ప్రమోషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. డైనోసార్ లాగానే ట్రంప్ కు భారీ శరీరం, చిన్న తల, చేతులు ఉంటాయని చెప్పింది. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కే తన మద్దతు ఉంటుందని తెలిపింది. అంతేకాదు, హిల్లరీ కోసం ఇటీవల చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొంది.