: కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మలా దేవిని అరెస్ట్ చేసిన జార్ఖండ్ పోలీసులు
బార్కగావ్‌లో ఎన్టీపీసీ కోల్ బ్లాక్ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మలా దేవిని జార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్టీపీసీ కోసం ప్రజల నుంచి భూసేకరణ చేస్తోన్న ప్రభుత్వం వారికి పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తోందని కొన్ని రోజుల నుంచి నిర్మలాదేవి తన భర్త మాజీ మంత్రి కాంగ్రెస్ నేత యోగేంద్ర సౌతో కలిసి ఆందోళన తెలుపుతున్నారు. దీంతో ఆమెపై ఇటీవలే అరెస్టు వారెంట్ జారీ అయింది. దీంతో పోలీసులు నిన్న హజారీబాగ్‌లోని ఓ ఇంటివద్ద ఆమె అరెస్టు చేశారు. ఇదే ఆందోళనలో భాగంగా ఆమె ఈ నెల 1న బార్కగావ్‌లో అరెస్టయి, మళ్లీ విడుదలయ్యారు. ఆమెతో పాటు నిరసనలో పాల్గొన్న ఆమె భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మరో కేసులో ఆమె కుమారుడు సైతం అరెస్టయ్యాడు.