: కుటుంబ ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించిన నారా లోకేశ్‌.. వివరాలు ఇవే...!


టీడీపీ యువ‌నేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి కుమారుడు నారా లోకేశ్ త‌మ కుటుంబ ఆస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ రోజు గుంటూరులో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ... వ‌ర‌స‌గా ఎనిమిదో సంవ‌త్స‌రం త‌మ కుటుంబ ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డిస్తున్నామ‌ని తెలిపారు. నారా లోకేశ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం చంద్ర‌బాబు నాయుడి ఆస్తుల వివ‌రాలు.. * హైద‌రాబాద్‌లోని నివాసం విలువ రూ.3 కోట్ల 68 ల‌క్ష‌లు * చంద్ర‌బాబు అంబాసిడ‌ర్ కారు రూ.ల‌క్షా 52 వేలు. * చంద్ర‌బాబు ఖాతాలోని న‌గ‌దు రూ.3 ల‌క్ష‌ల 59 వేలు * చంద్ర‌బాబు మొత్తం ఆస్తులు రూ.3 కోట్ల 73 ల‌క్ష‌లు * చంద్ర‌బాబు పేరిట బ్యాంకు రుణం రూ3 కోట్ల 6 ల‌క్ష‌లు * చంద్ర‌బాబు నిక‌ర ఆస్తులు రూ.6 కోట్ల 7 ల‌క్ష‌లు నారా భువ‌నేశ్వ‌రి పేరిట ఉన్న ఆస్తుల వివ‌రాలు.. * పంజాగుట్ట‌లో ఉన్న స్థ‌లం విలువ రూ. 73 ల‌క్ష‌లు * త‌మిళ‌నాడులోని భూమి విలువ రూ.కోటి 86 ల‌క్ష‌లు * మ‌దీనాగూడ‌లోని భూమి విలువ రూ.73 ల‌క్ష‌లు... * హెరిటేజ్ ఫుడ్‌లో భువ‌నేశ్వ‌రి వాటాల విలువ రూ.19 కోట్ల 95 లక్ష‌లు * వివిధ కంపెనీల్లోని భువ‌నేశ్వ‌రి పేరిట ఉన్న వాటాల విలువ రూ.3 కోట్ల 28 ల‌క్ష‌లు * భువ‌నేశ్వ‌రి పీఎఫ్ ఖాతా నిలువ రూ.కోటి 73 ల‌క్ష‌లు * భంగారు ఆభ‌ర‌ణాల విలువ రూ.కోటి 27 ల‌క్ష‌లు * కారు విలువ రూ.91 ల‌క్ష‌లు * భువ‌నేశ్వ‌రి పేరిట ఉన్న మొత్తం ఆస్తులు రూ.38కోట్ల 66ల‌క్ష‌లు * అప్పులు రూ.13 కోట్లు * నిక‌ర ఆస్తులు రూ24 కోట్ల 84 ల‌క్ష‌లు.

  • Loading...

More Telugu News