: హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి చేరిన వంశీ గుండె


అనారోగ్యం కారణంగా బ్రెయిన్‌డెడ్‌కు గుర‌యిన 29 ఏళ్ల గంగుల వంశీకృష్ణ అవ‌య‌వాల‌ను దానం చేసేందుకు అత‌డి కుటుంబ స‌భ్యులు అంగీక‌రించిన సంగ‌తి తెలిసిందే. దీంతో విజయవాడలోని ఆంధ్ర ఆసుప‌త్రి నుంచి అతని అవ‌య‌వాల‌ను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ట్రాఫిక్ పోలీసుల సాయంతో వంశీ గుండె విమానాశ్ర‌యం నుంచి హైదరాబాద్ ఫిలింన‌గ‌ర్‌లోని అపోలో ఆసుపత్రికి నిమిషాల వ్యవధిలో చేరుకుంది. మ‌రోవైపు సికింద్రాబాద్ య‌శోద ఆసుప‌త్రికి అత‌డి కాలేయాన్ని తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News