: తుందుర్రులో నేడు జగన్ పర్యటన.. ఆక్వాఫుడ్ బాధితులతో ముఖాముఖి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలోని తుందుర్రులో పర్యటించనున్నారు. అక్కడ నిర్మించ తలపెట్టిన గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు. నేటి ఉదయం 9 గంటలకు జగన్ గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తణుకు వెళ్తారు. 36 రోజులుగా అక్కడి సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న తుందుర్రు గ్రామస్తురాలు, ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమకారిణి ఆరేటి సత్యవతిని పరామర్శిస్తారు. అనంతరం ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారిని కలుసుకుని ముఖాముఖి నిర్వహిస్తారు.