: 1996 నుంచి నేతలు, అధికారుల కనుసన్నల్లోనే నయీమ్ ఉన్నాడు: సీపీఐ నారాయణ
తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసును సిట్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే, నయీమ్ కేసులో సిట్ దర్యాప్తుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కేసును సీీబీఐతో విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... 1996 నుంచి నేతలు, అధికారుల కనుసన్నల్లోనే నయీమ్ ఉన్నాడని అన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని తాము హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ వేశామని గుర్తు చేశారు. సీబీఐ విచారణతో రాజకీయ నేతల పాత్ర బయటపడుతుందని అన్నారు.