: నేను మేధావిని కాదు కనుక నాకు దేశమే ఫస్టు...పాకిస్థాన్ కళాకారుల నిషేధంపై ముఖేష్ అంబానీ వ్యాఖ్య
బాలీవుడ్ లో పాకిస్థాన్ కళాకారుల నిషేధం పెనుదుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పాత్రికేయులు శేఖర్ గుప్తా, బర్ఖాదత్ ఆద్వర్యంలో 'ది ప్రింట్' నిర్వహించిన 'ఆఫ్ ది కఫ్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తనకు కళలు, సంస్కృతి కన్నా భారతదేశమే ముఖ్యమైనదని స్పష్టం చేశారు. 'నేను ఒక విషయం గురించి చాలా స్పష్టంగా ఉన్నాను. అదేమిటంటే నాకు ఎల్లప్పుడూ దేశమే మొదటి స్థానంలో ఉంటుంది. దేశానికే నేను ప్రాధాన్యం ఇస్తాను. నేను మేధావిని కాను కాబట్టి నాకు ఇవేవీ అర్థం కావు. కానీ అందరు భారతీయులలాగానే నాకు కూడా భారతదేశమే మొదటి స్థానంలో ఉంటుంది' అని అంబానీ చెప్పారు. కాగా, సల్మాన్, ప్రియాంకా తదితరులంతా పాక్ నటులపై ఎందుకు నిషేధం విధించారంటూ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.