: సైనాకు అరుదైన గౌరవం.. ఐఓసీ అథ్లెట్ కమిషన్లో సభ్యత్వం
ఇండియన్ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ కు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అథ్లెట్ కమిషన్ సభ్యురాలిగా సైనా నియమితురాలైంది. ఈ మేరకు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాష్ రాసిన లేఖ సైనాకు అందింది. ఏంజెలో రుగీరో అధ్యక్షతన ఏర్పాటైన అ కమిటీలో 9 మంది ఉపాధ్యక్షులు, 10 మంది సభ్యులు ఉంటారు. నవంబర్ 6వ తేదీన ఈ కమిషన్ తొలి సమావేశం జరగనుంది. సైనా నియామకం పట్ల బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, ఆమె తండ్రి హర్ వీర్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు.