: కేసీఆర్ కు వాస్తు భయం పట్టుకుంది.. గుత్తా కాదు 'చెత్త' సుఖేందర్ రెడ్డి: కోమటిరెడ్డి


తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని పడగొట్టి వెయ్యి కోట్ల రూపాయలతో కొత్త సెక్రటేరియట్ నిర్మిస్తామని కేసీఆర్ చెప్పడం పిచ్చి తుగ్లక్ చర్య అని మండిపడ్డారు. ప్రజా ధనాన్ని ఇలా దుర్వినియోగం చేసే హక్కు ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు. కొత్త సచివాలయం నిర్మాణం పేరిట వేల కోట్ల రూపాయలను ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు వాస్తు భయం పట్టుకుందని, అందుకే, ఇంత డబ్బు ఖర్చు పెట్టి కొత్త సచివాలయం నిర్మించాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డిపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన గుత్తా కాదు 'చెత్'త సుఖేందర్ రెడ్డిగా మారారని, గత ఎన్నికల్లో తన వల్లే ఆయన గెలిచాడని అన్నారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ చేపట్టనున్న రైతు దీక్షకు తమ మద్దతు ఉంటుందని, నవంబర్ మొదటి వారంలో తాను కూడా 72 గంటల పాటు దీక్ష చేస్తానని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News