: చట్టాన్ని ఉల్లంఘించిన యువతికి బహిరంగ శిక్ష.. బెత్తంతో తీవ్రంగా కొట్టిన వైనం!


ఇస్లామిక్ చట్టాలను ఉల్లంఘించినందుకు ఓ యువ‌తిని న‌డిరోడ్డుపై బెత్తంతో తీవ్రంగా కొట్టిన ఘ‌ట‌న ఇండోనేషియాలో చోటుచేసుకుంది. ఎంతో మంది చూస్తుండ‌గానే ఆమెను రోడ్డు మ‌ధ్య‌లో కూర్చోబెట్టి ఈ శిక్ష విధించారు. స‌ద‌రు యువ‌తి త‌న‌ను కొట్టొవ‌ద్ద‌ని అరుస్తున్నా జ‌న‌మంతా వినోదం చూస్తున్న‌ట్లు చూశారు. అనంత‌రం ఆ యువ‌తితో పాటు మ‌రో ఏడుగురు పురుషులు, ఆరుగురు మ‌హిళ‌ల‌కు కూడా ఇదే త‌ర‌హా శిక్ష‌ను అమ‌లుప‌రిచారు. వారికి శిక్ష విధిస్తోంటే చుట్టూ ఉన్న జ‌నం న‌వ్వుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇండోనేషియాలోని ప‌లు రాష్ట్రాల్లో షరియా చట్టాన్ని ప‌క‌డ్బందీగా అమలుచేస్తారు. జూదం జోలికి వెళ్లినా, మద్యం ముట్టుకున్నా, స్వలింగ సంపర్కంలో పాల్గొన్నా ఇటువంటి శిక్ష‌లే విధిస్తారు. తాజాగా శిక్షకు అర్హులయిన వీరంద‌రికీ ఆ రాష్ట్ర రాజధాని బందా అసేలో ఒక మసీదు వద్ద నిల‌బెట్టి ఈ శిక్ష విధించారు. పెళ్లి కాని అమ్మాయిలూ, అబ్బాయిలు ఒక‌రినొక‌రు ముట్టుకోవడం, కౌగలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం ద్వారా వీరంతా త‌మ చట్టాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తించార‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News