: నకిలీ కరెన్సీతో జూనియర్ ఆర్టిస్టుకి టోకరా వేసిన ఆటో డ్రైవర్!
నకిలీ కరెన్సీ మనల్ని ఎంతగా బోల్తా కొట్టిస్తుందో తెలిపే సంఘటన ఇది. ముంబైలో మేఘా చక్రవర్తి అనే యువతి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తోంది. షూటింగ్ స్పాట్ నుంచి ఆటోలో ఇంటికి వచ్చిన ఆమె చిల్లర లేకపోవడంతో 500 రూపాయల నోటు డ్రైవర్ కిచ్చింది. తరవాత అతను ఇచ్చిన చిల్లర తీసుకుని పర్సులో పెట్టుకుని ఇంటికి చేరింది. కాస్సేపయ్యాక మరో అవసరానికి డబ్బులు తీయగా, ఆ ఆటో డ్రైవర్ ఇచ్చిన వంద నోటు ఒకటి నకిలీదని గుర్తించింది. దీంతో తనలా ఎవరూ మోసపోకూడదని చెబుతూ, సోషల్ మీడియాలో ఆ వంద నోటును పోస్టు చేసింది. అందులో 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' అని ఉండడానికి బదులుగా చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి వుంది. ఓ సారి మీరు కూడా ఆ నోటు ఫోటోను ఇక్కడ చూడండి. ఆశ్చర్యపోవడం మీ వంతవుతుంది!