: పోలీసులు వేధిస్తున్నారంటూ కొయ్యూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఓ నిందితుడి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం


జయశంకర్ జిల్లాలోని కొయ్యూరులో ఈ రోజు మ‌ధ్యాహ్నం కలకలం రేగింది. పోలీసులు వేధిస్తున్నారంటూ కొయ్యూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన వ్య‌క్తి పేరు ప్రేమ్‌కుమార్‌రెడ్డి అని పోలీసులు తెలిపారు. ప్రేమ్‌కుమార్‌ పురుగుల ముందు తాగి ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడ‌ని చెప్పారు. అత‌డిని మంథ‌ని ఆసుప‌త్రికి త‌ర‌లించినట్లు తెలిపారు. ప్రేమ్‌కుమార్‌రెడ్డి గుప్త‌నిధుల త‌వ్వ‌కాల కేసులో నిందితుడిగా ఉన్నాడు.

  • Loading...

More Telugu News