: టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ 'చెత్త నగరం'గా మారింది: దానం నాగేందర్
టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ 'చెత్త నగరం'గా మారిందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు త్వరలోనే ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. పార్టీలో తనకు ఏ బాధ్యతలూ అప్పజెప్పకపోవడం వల్లే తాను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని దానం తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలు కావడంతో... ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేశారు. ఒకానొక దశలో ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు కూడా వార్తలు హల్ చల్ చేశాయి.