: 2002-13 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయంలో తెలంగాణకు వాటా ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్


తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెలంగాణకు వాటా రావాలని హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఈ రోజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న‌కు ముందు 2002-13 మ‌ధ్య‌ వరకు టీటీడీ ఆదాయంలో తెలంగాణ రాష్ట్రానికి వాటా రావాల‌ని ఆయ‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటాను హైకోర్టు ఇప్పించాలని ఆయ‌న కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం స్వీక‌రించింది. ఈ అంశంపై త‌మ‌కు మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని టీటీడీతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ స‌ర్కారుల‌కు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News