: విజయనగరంలోని 75 అడుగుల భారీ హనుమాన్ విగ్రహానికి హెలికాఫ్టర్ తో పుష్పాభిషేకం చేసిన నిర్వాహకులు
విజయనగరం జిల్లా రామనారాయణంలో నిర్మించిన 75 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అంజనీ పుత్రుని విగ్రహంపై పూల వర్షం కురిపించారు. ఇందుకోసం హెలికాప్టర్‌ను ఉపయోగించారు. హెలికాప్టర్ నుంచి హనుమంతుడి విగ్రహంపై పూలు వదిలి పుష్పాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని చూడడానికి భక్తులు పోటెత్తారు. ఆంజనేయస్వామి విగ్రహంపై పూల వర్షం కురుస్తుండగా ఆ దృశ్యాలని తమ సెల్ఫోన్లలో బంధించడానికి భక్తులు పోటీ పడ్డారు.