: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈ ఉదయం ఏ1 614 విమానం ల్యాండ్ అవుతుండగా, దాని టైర్ పేలిపోయింది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జరిగిన ఘటనతో, ఒక్కసారిగా కలకలం రేగింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో 128 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. అయితే, ఈ ఘటన వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని... ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.