: ప్రధాని హోదాలో తొలిసారి హిమాచల్ ప్రదేశ్ లో అడుగుపెట్టిన మోదీ
ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ తొలిసారి హిమాచల్ ప్రదేశ్ లో ఈ రోజు అడుగుపెట్టారు. ఆ రాష్ట్రంలోని ‘మండి’కి చేరుకున్న ఆయనకు బీజేపీ రాష్ట్ర నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడ నిర్మించిన మూడు జలవిద్యుదుత్పత్తి కేంద్రాలను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. వాటితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి అనంతరం అక్కడ ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. మోదీ రాకతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 68 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్‌లో శాసనసభకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో బీజేపీని మరింత బలపరిచే దిశగా మోదీ ప్రసంగించనున్నారు. మండిలో కార్యక్రమంలో పాల్గొన్న తరువాత ఆయన అదే రాష్ట్రంలోని నహాన్‌లోనూ పర్యటించనున్నారు.