: డ్రగ్స్ పై ఉక్కుపాదం తరువాత... పొగరాయుళ్లపైకి రొడ్రిగో!


మాదకద్రవ్యాల వ్యాపారంపైన, డ్రగ్స్ స్మగ్లర్లపైన ఉక్కుపాదం మోపిన ఫిలిప్పీన్ దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యూరెట్టో, తాజాగా దేశవ్యాప్త ధూమపాన నిషేధం దిశగా సాగుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం గమనార్హం. దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తయారు చేసే ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై తాను సంతకం చేయనున్నట్టు తెలిపారు. గతంలో డోవా నగర మేయర్ గా ఉన్న వేళ, అక్కడ పొగ తాగడాన్ని నిషేధించి, దాన్ని విజయవంతంగా అమలు చేసిన ఘనత రోడ్రిగోకుంది. దేశంలో ధూమపానం అధికమై, వేలాది మంది మరణిస్తున్నారని నివేదికలు వస్తున్నాయని గుర్తుచేసిన రొడ్రిగో, ఇకపై ఎవరైనా పొగ తాగాలనుకుంటే, అందుకు అనుమతించే ప్రాంతాలకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News