: చిత్తూరులో కలకలం... రూమ్‌లో తాళ్ల‌తో క‌ట్టేసి తోటి విద్యార్థి గొంతుకోసిన విద్యార్థి


చిత్తూరు జిల్లాలో దారుణ ఘ‌ట‌న వెలుగులోకొచ్చింది. తోటి విద్యార్థిని రూమ్‌లో తాళ్ల‌తో క‌ట్టేసిన ఓ యువ‌కుడు అనంత‌రం బ్లేడ్ తో అత‌డి గొంతుకోసి, అక్క‌డి నుంచి పారిపోయాడు. త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసిన బాధితుడు సాయిమోహ‌న్ త‌న ప‌రిస్థితి గురించి చెప్పాడు. ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న త‌ల్లిదండ్రులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయిమోహ‌న్‌ని పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. శ‌శిధ‌ర్‌రెడ్డి అనే విద్యార్థి వ‌ద్ద బాధితుడు సాయిమోహ‌న్ డబ్బులు తీసుకున్నాడ‌ని, ఈ విష‌యంపై వారిరువురి మ‌ధ్య కొన్ని రోజులుగా గొడ‌వ జ‌రుగుతోందని తోటి విద్యార్థులు పోలీసుల‌కి తెలిపారు. ప్ర‌స్తుతం సాయిమోహ‌న్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్లు చెప్పారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు మొద‌లుపెట్టారు.

  • Loading...

More Telugu News