: కల్యాణ్ రామ్ ‘సిక్స్ ప్యాక్’ కోసం ఎంతగా కష్టపడ్డాడో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది!
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందించిన ‘ఇజం’ చిత్రంలో హీరో నందమూరి కల్యాణ్ రామ్ ‘సిక్స్ ప్యాక్’లో కనిపించనున్నాడు. అయితే, ఈ సిక్స్ ప్యాక్ కోసం కల్యాణ్ రామ్ ఎంతగా కష్టపడ్డాడనే విషయాన్ని వివరించేందుకు పూరీ ఒక వీడియో విడుదల చేశాడు. అభిమానులతో పంచుకున్న ఈ వీడియో ఆకట్టుకుంటోంది. కల్యాణ్ రామ్ తన కోచ్ సమక్షంలో ఏ విధంగా తన బాడీని సిక్స్ ప్యాక్ గా మలిచాడో ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఈ నెల 21న ‘ఇజం’ విడుదల కానున్న నేపథ్యంలో ఈ వీడియోను విడుదల చేయడం గమనార్హం.