: వర్మ స్టయిల్ లో ‘సర్కార్ 3’ ఫస్ట్ లుక్ విడుదల


దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘సర్కార్ 3’ ఫస్ట్ లుక్ విడుదలైంది. వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆయన శైలిలోనే ఉంది. ఈ చిత్రంలోని పాత్రలన్నింటిని ఒకేసారి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వర్మ పరిచయం చేశారు. ‘సర్కార్ 3’ చిత్ర కథపరంగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ లకు అవకాశం లేదని, అందుకే వాళ్లు ఈ చిత్రంలో లేరని వర్మ పేర్కొన్నారు. ఆయా నటులు పోషించే పాత్రలను వర్మ వివరించారు. సుభాష్ నాగే పాత్రలో మళ్లీ అమితాబ్ బచ్చనే కనిపిస్తారని, జాకీష్రాఫ్ కూడా అదే లుక్ లో కనిపించనున్నారని వర్మ పేర్కొన్నారు. ‘సర్కార్ 3’లో కొత్తగా కనిపించే పాత్రల విషయానికొస్తే .. గోవింద్ దేశ్ పాండే పాత్రలో మనోజ్ బాజ్ పాయ్, సర్కార్ కుడిభుజంగా, నమ్మిన బంటు పాత్రలో రోనిత్ రాయ్, సర్కార్ సినిమాలో జులాయి కొడుకు విష్ణు ఉంటాడు.. అతని కొడుకు పాత్రలో శివాజీ అలియాస్ చీకు అనే పాత్రలో ‘సర్కార్ 3’ ద్వారా అమిత్ సాద్ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రధాన విలన్ పాత్రల్లో జాకీష్రాఫ్, భరత్ ధబోల్కర్, లేడీ విలన్ పాత్రలో రుక్కుబాయ్ దేవిగా రోహిణి హట్టంగడి కనిపించనున్నారు. తన తండ్రిని చంపిన సర్కార్ పై పగ తీర్చుకునే అన్ను కర్కరే పాత్రలో నటి యామి గౌతమ్ కనిపించనున్నట్లు వర్మ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News