: తమిళనాడులో మూడు స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల నేపథ్యంలో రెండు నియోజక వర్గాల ప్రాంతాల్లో భారీగా డబ్బు దొరకడంతో ఎన్నికల కమిషన్ ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేసింది. మరోవైపు ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందడంతో మరో స్థానంలోనూ ఉప ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం మూడు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలకు ఈ రోజు షెడ్యూల్ విడుదలయింది. వచ్చేనెల 19న ఈ మూడు స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు పేర్కొంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ఉప ఎన్నికలకు అన్నాడీఎంకే తరఫున అభ్యర్థుల ఖరారు అంశంపై ఎవరు నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.