: ప్రజల కోసమే రాజకీయాల్లో ఉన్నాం: వైయస్ వివేకానంద రెడ్డి
ప్రజల సంక్షేమం కోసమే తాము రాజకీయాల్లో ఉన్నామని... అధికారాన్ని అనుభవించడానికి కాదని వైసీపీ నేత, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. కడప జిల్లా రాజంపేటలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అమర్ నాథ్ రెడ్డి అధ్యక్షతన స్థానిక సంస్థాగత ఎమ్మెల్సీ ఎన్నికల సభ జరిగింది. ఈ సమావేశంలో ప్రసంగిస్తూ, వివేకానంద రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలు కూడా హాజరయ్యారు.