: ఒక్క సెకనులోపే అమ్ముడైపోయిన షియోమీ రూ. 1 స్మార్ట్ ఫోన్లు... లక్షలమందికి నిరాశ!
ఒక్క రూపాయికే షియోమీ రెడ్ మీ 3 ఎస్ ప్రైమ్ స్మార్ట్ ఫోన్ ను దక్కించుకోవాలని ఆశపడ్డ లక్షలాది మందికి నిరాశే ఎదురైంది. మధ్యాహ్నం 2 గంటలకు 30 స్మార్ట్ ఫోన్లను రూ. 1కే అందిస్తామని సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సేల్ లో పాలు పంచుకోవాలని కోట్లాది మంది రిజిస్టర్ చేసుకున్నారు కూడా. ఇక సరిగ్గా రెండు గంటలకు ఫోన్ ను కొనాలని లక్షలాది మంది సంస్థ వెబ్ సైట్లో లాగిన్ అయి కూర్చుండగా, రెండు గంటలా ఒక్క సెకనుకు ఫోన్లన్నీ అమ్ముడైపోయిన సమాచారం వెక్కిరించింది. షియోమీ ప్రకటించినట్టు 30 మందికైనా ఈ ఫోన్లు అందాయో లేదో? ఇక నేడు మార్కెట్లోకి వచ్చిన రెడ్ మీ 3 ఎస్, రెడ్ మీ 3 ఎస్ ప్రైమ్ ఫోన్ల అమ్మకాలు ముగిశాయని సంస్థ ప్రకటించింది. ఫ్లాష్ సేల్ ముగిసిన నిమిషాల్లోపే అందుబాటులో ఉంచిన ఫోన్ యూనిట్లన్నీ అమ్ముడైపోయాయని షియోమీ ప్రకటించింది. కాగా, మరో రెండు రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటలకు రూ. 1కే 30 స్మార్ట్ ఫోన్లను అందుబాటులో ఉంచుతామని సంస్థ పేర్కొంది.