: అమెరికా దృష్టి అంతా మనమీదే... జాగ్రత్త!: రష్యా అధ్యక్షుడు పుతిన్
బ్రిక్స్ సమావేశం నేపథ్యంలో, తన భారత పర్యటనపై అమెరికా పూర్తి నిఘా పెట్టిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ప్రతి విషయాన్నీ అమెరికా క్షుణ్ణంగా పరిశీలిస్తోందని, జర్నలిస్టుల కామెంట్లపై కూడా దృష్టి పెట్టిందని... రష్యాలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రష్యన్ జర్నలిస్టులను పుతిన్ హెచ్చరించారు. సిరియా సంక్షోభం నేపథ్యంలో, అమెరికా, రష్యాల మధ్య అంతరం మరింత పెరిగింది. మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలున్నాయంటూ పుతిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేపాయి. రష్యా కదలికలను అమెరికా, అమెరికా కార్యకలాపాలను రష్యా సునిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలోనే, తమ జర్నలిస్టులను పుతిన్ హెచ్చరించారు.