: పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 27 మంది దుర్మరణం
పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 27 మంది దుర్మరణం చెందగా, మరో 65 మంది గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్స్ లో ఎదురెదురుగా వచ్చిన రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కరాచీ నుంచి బాహల్పూర్ కు వెళుతున్న బస్సు, ఫైసలాబాద్ నుంచి సాదిఖాబాద్ కు వెళుతున్న మరో బస్సు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదం నేపథ్యంలో, చెల్లాచెదురుగా పడిన మృత దేహాలు, క్షతగాత్రుల ఆందోళనతో ఘటనాస్థలి బీభత్సంగా మారిందని... గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని ఓ పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని... వీరిలో పలువురు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పారు.