: ఎస్సై జేబుకు కన్నం వేసిన దొంగలు
హస్తలాఘవం ప్రదర్శిస్తున్న జేబు దొంగలు ఏకంగా ఎస్సై జేబును ఖాళీ చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చోటుచేసుకుంది. పట్టణంలో రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్లను లక్ష్యంగా చేసుకున్న జేబుదొంగలు రెచ్చిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే... దొండపాడు ప్రాంతానికి చెందిన యాళ్ల పౌలురాజు విజయవాడలో ఆర్మ్డ్ రిజర్వ్ ఎస్సైగా పని చేస్తున్నారు. ఈనెల 13 సాయంత్రం ఆయన విజయవాడ వెళ్లేందుకు ఏలూరు పాత బస్టాండ్ కు వచ్చారు. అక్కడ బస్సు ఎక్కే సమయంలో దొంగలు అతని జేబులో పర్సు నొక్కేశారు. ఆ సమయంలో పర్సులో 43 వేల రూపాయలు, ఏటీఎం డెబిట్ కార్డు ఉన్నాయని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.