: కోమటిరెడ్డి రాజీనామా చేస్తే...నేను కూడా రాజీనామా చేస్తా: గుత్తా సవాల్


ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ, నల్లగొండ జిల్లా బునాదిగాని కాల్వ, పిల్లాయి కాల్వ ఆధునికీకరణ పనుల కోసం 285 కోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. నల్గొండ జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న కేసీఆర్ పై మతి భ్రమించినట్టు కోమటిరెడ్డి విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News