: 'డబ్ల్యూడబ్ల్యూఈ'లో గ్రేట్ ఖలీ వారసుడిగా ఎంట్రీ ఇవ్వనున్న ఒలింపిక్ స్టార్


రియో ఒలింపిక్స్ లో స్థానం దక్కకపోవడంతో రెజ్లింగ్ స్టార్ సుశీల్ కుమార్ గ్రేట్ ఖలీ వారసుడిగా డబ్ల్యూడబ్ల్యూఈ (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్) బరిలో దిగనున్నాడు. ఈ మేరకు సుశీల్ కుమార్ అధికారికంగా ప్రకటించాడు. 'సుల్తాన్' సినిమాలో సల్మాన్ ఖాన్ లా దేశానికి పతకాలు అందించిన సుశీల్ కుమార్ ప్రొఫెషనల్ రెజ్లర్ గా మారనున్నాడు. ఒలింపిక్స్ సందర్భంగా వివాదానికి కేంద్రంగా నిలిచిన సుశీల్ కుమార్ తనపై పడ్డ మచ్చను చెరిపేసుకునేందుకు, తానేంటో మరోసారి నిరూపించుకునేందుకు ప్రొఫెషనల్ రెజ్లర్ గా మారనున్నాడని సన్నిహితులు పేర్కొంటున్నారు. అయితే ప్రొఫెషనల్ రెజ్లింగ్ లో సుశీల్ విజయం సాధిస్తాడా? అన్నది చూడాలని అంతా ఆసక్తి చూపుతున్నారు.

  • Loading...

More Telugu News