: పాకిస్థాన్ కి, తాలిబాన్ కి తేడాలేదు: బలూచిస్థాన్ నాయకురాలు
పాకిస్థాన్ కి, తాలిబాన్ కి తేడా లేదని బలూచిస్థాన్ మహిళా ఉద్యమనాయకురాలు నయేలా ఖాద్రీ అన్నారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, తాలిబాన్ లాంటి పాకిస్థాన్ కు వ్యతిరేకంగా తామంతా పోరాటం చేస్తున్నామని అన్నారు. బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ సీమాంతర ఉగ్రవాదంపై చాలా బాగా మాట్లాడారని ఆమె తెలిపారు. ఉగ్రవాదం అణచివేత కోసమంటూ పాకిస్థాన్ యూరోపియన్ దేశాల నుంచి నిధులు తీసుకుంటూ అదే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆమె ఆరోపించారు. ఉగ్రవాదం, బలూచిస్థాన్ పై భారత్ అనుసరిస్తున్న వైఖరి పట్ల తామంతా చాలా సంతోషంగా ఉన్నామని ఆమె తెలిపారు.