: వైఎస్సార్సీపీ నుంచి కూలిన మరో వికెట్... 21న టీడీపీలో చేరనున్న బూరగడ్డ వేదవ్యాస్
వైఎస్సార్సీపీ నుంచి వలసలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ పార్టీకి చెందిన మరో నేత టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ టీడీపీలో చేరనున్నారు. ఆయన ఈ నెల 21న టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసిన ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కాగా, వేదవ్యాస్ కుమారుడు, లోకేష్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా ఆయన పార్టీ మారుతున్నట్టు గత రెండు రోజులుగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.