: మారని పాక్, ఆర్మీ పోస్టులపై కాల్పులు, దీటుగా బదులిస్తున్న సైన్యం


పాక్ సైన్యం ఈ ఉదయం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూ కాశ్మీర్ పరిధిలోని నౌషారా సెక్టార్‌ లో భారత ఆర్మీ పోస్టులే లక్ష్యంగా పాక్‌ కాల్పులు జరుపగా, ఏమాత్రం వెనక్కి తగ్గని భారత సైన్యం దీటుగా సమాధానం చెబుతున్నాయి. తేలికపాటి మోర్టార్లు, ఏకే-47లతో పాక్ సైన్యం కాల్పులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సర్జికల్ దాడులు జరిపి, పాక్ ను అంతర్జాతీయ సమాజం ఎదుట దోషిగా నిలిపినా కూడా ఆ దేశం బుద్ధిని మార్చుకోకుండా, కాల్పులకు తెలబడుతుండటం గమనార్హం. భారత్ సహనాన్ని పదేపదే పరీక్షిస్తున్న పాకిస్థాన్ పాలకులకు బుద్ధి వచ్చేలా మరిన్ని దాడులు చేయాలని రక్షణ రంగ నిపుణులు సలహా ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News