: దీపికా అంటే ఇష్టం... జాక్వెలిన్ అంటే పడి ఛస్తా: డ్వెన్ బ్రావో
శ్రియ శరణ్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ వెస్టిండీస్ క్రికెటర్ డ్వెన్ బ్రావోపై ఆరోపణలు వచ్చిన మూడు రోజుల్లోనే బాలీవుడ్ హీరోయిన్లపై ఈ విండీస్ క్రికెటర్ అంతులేని అభిమానం ప్రదర్శించాడు. హిందీ టీవీలో ప్రసారమయ్యే ఝలక్ దిఖ్ లాజా-9 షోలో పాల్గొంటున్న సందర్భంగా డ్వెన్ బ్రావో మాట్లాడుతూ, తనకు దీపికా పదుకొనే అంటే చాలా ఇష్టమన్నాడు. జాక్వలిన్ ఫెర్నాండెజ్ అంటే పడి చస్తానని చెబుతున్నాడు. హిందీ సినిమాల్లో నటించాలనుందని, కరణ్ జోహర్ సినిమాలో అవకాశం వస్తే ఎగిరి గంతేస్తానని చెప్పాడు. పెద్దగా హిందీ సినిమాలు చూడలేదని చెప్పిన బ్రావో, భారతీయ టీవీషోల్లో పాల్గొనడాన్ని ఎంజాయ్ చేస్తున్నానని అన్నాడు. బాలీవుడ్ లో అవకాశం వస్తే నటిస్తానని చెప్పాడు. కరణ్ జోహార్ సినిమాలో దీపికా పదుకొనే సరసన నటించేందుకు తాను సిద్ధమని ప్రకటించాడు. బాలీవుడ్ హీరోయిన్లందరు తనకు బాగా నచ్చుతారని చెప్పిన బ్రావో, ఝలక్ దిఖ్ లాజా-9 టీవీ షో సందర్భంగా జాక్వలిన్ ఫెర్నాండెజ్ ను కలిశానని, ఆమె చాలా నచ్చేసిందని అన్నాడు. మొత్తానికి ఐపీఎల్ తో ఎంట్రీ ఇచ్చిన బ్రావో..బాలీవుడ్ పై బాగానే కన్నేశాడు.